Lokesh: వాట్సాప్ ద్వారా 153 సేవలు ఇచ్చేందుకు కార్యాచరణ..! 11 d ago
ఏపీ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. వాట్సాప్ గవర్నన్స్పై కాన్ఫరెన్స్లో చర్చించారు. ప్రభుత్వ సమాచారం అంతా ఒకే చోట ఉండేలా..వెబ్సైట్ను తీర్చిదిద్దుతామని తెలిపారు. వాట్సాప్ ద్వారా 153 సేవలు ఇచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. 10 రోజుల్లో ఈ సేవలు ప్రారంభం అవుతాయని లోకేష్ చెప్పారు. జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీ విధానాన్ని..రీఇంజనీరింగ్ చేయాల్సి ఉందని లోకేష్ పేర్కొన్నారు. UAE మాత్రమే ఒకేప్లాట్ఫామ్పై పౌరసేవలు అందిస్తోందని, అపార్ ఐడీజారీలో ఇబ్బందులను సరి చేస్తున్నామని లోకేష్ వివరించారు.